Wednesday, March 3, 2010

కన్నడ నేర్చుకుందాం - 8

పాటం ౮.
క్రియా పదముల గురించి తెలుసుకొనే ముందు కాలముల గురించి తెలుసుకుందాం.
ఉదాహరణకు ఒక క్రియాపదం తీసుకొని తెలుసుకొందాం తర్వాత కొన్ని క్రియా పదములను చూద్దాం.

క్రియా పదం: బరువుదు:రావటం (బా అంటే రా అని)

భూత కాలం:
ఏక వచనం :
పుంలింగం: బందను - వచ్చాడు. ఉదా: రాము బందను - రాము వచ్చాడు.
స్త్రీలింగం: బందళు - వచ్చింది. ఉదా: సీత బందళు - సీత వచ్చింది.
నపుంసకలింగం: బంతు. - వచ్చింది. ఉదా: బస్సు బంతు - బస్సు వచ్చింది.
మనం తెలుగులో స్త్రీలింగం మరియు నపుంసక లింగం ఒకేలా వాడతాం. కన్నడలో రెండు వేర్వేరు.

బావువచనం:
పుంలింగం, స్త్రీలింగం: బందరు - వచ్చారు - ఉదా: డా. రాజ్ బందరు. - డా. రాజ్ వచ్చారు, జనరు బందరు - జనం వచ్చారు, సుధా మూర్తి బందరు - సుధా మూర్తి వచ్చారు.
నపుంసకలింగం: బందవు - వచ్చాయి. ఉదా: బస్సుగళు బంధవు - బస్సులు వచ్చాయి.

No comments:

Post a Comment