వారాంతం కాబట్టి ప్రత్యేక పాటం. ప్రతి వారాంతం లోను ప్రత్యేక పాటలు చెప్పుకుందాం.
ప్రత్యేక పాటం - 1
ఈ వారం కన్నడ లిపి గురించి చెప్పుకుందాం.
కన్నడ తెలుగు లిపి 90% ఒకేలా వుంటుంది.
అచ్చులు - స్వరగళు
ಅ ಆ ಇ ಈ ಉ ಊ ಋ ಎ ಏ ಐ ಒ ಓ ಔ ಅಂ ಅಃ
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః
కన్నడ లో ౠ అక్షరం లేదు.
ಉ ಊ ఋ - ఈ మూడు అక్షరాలు మాత్రం చాల భిన్నంగా ఉంటాయి. ಎ ಏ - కొంచం తేడాగా ఉంటాయి. మిగిలినవన్నీ తెలుగు అక్షరాలే.
హల్లులు - వ్యంజనగళు
ಕ ಖ ಗ ಘ ಙ - క ఖ గ ఘ ఙ : ಕ చాల బిన్నంగ వుంటాది. ಘ కొంచం భిన్నంగ వుంటాది.
ಚ ಛ ಜ ಝ ఞ - చ ఛ జ ఝ ఞ : ಚ ಛ భిన్నంగ ఉంటాయి.
ಟ ಠ ಡ ಢ ಣ - ట ఠ డ ఢ ణ :ಠ ಣ తప్ప మిగిలినవన్నీ కొంచం భిన్నంగ ఉంటాయి.
ತ ಥ ದ ಧ ನ - త థ ద ధ న : అన్ని ఒకేలా ఉంటాయి
ಪ ಫ ಬ ಭ ಮ - ప ఫ బ భ మ - ಪ ಫ ಮ కొంచం బిన్నంగా ఉంటాయి.
ಯ ರ ಲ ವ ಶ ಷ ಸ ಹ ಳ - య ర ల వ శ ష స హ ళ : ವ కొంచం బిన్నంగ వుంటాది. ಹ చాల బిన్నంగా వుంటాది.
ఱ కన్నడలో లేదు.
గుణింతం - క అక్షరం చాల బిన్నంగ వుంటాది కాబట్టి గ గుణింతం తీసుకున్నాను. ఇలా అయితే తేడాలు స్పష్టంగ తెలుస్తాయి.
ಗ ಗಾ ಗಿ ಗೀ ಗು ಗೂ ಗೃ ಗೆ ಗೇ ಗೈ ಗೊ ಗೋ ಗೌ ಗಂ ಗಃ - గ గా గి గీ గు గూ గృ గె గే గై గొ గో గౌ గం గః
ಗೀ ಗೇ ಗೋ అక్షరాలు గమనించండి. అవి వాటి ముందు అక్షరంలానే వున్నాయి. తేడా మాత్రం 6 ని తిరగేసి రాయాలి.
Subscribe to:
Post Comments (Atom)
I really appreciate your patience and time for this effort. Thanks!
ReplyDeleteThank you Reddygaru. These kind of appreciations are boosting me to write more. Thanks a lot.
ReplyDeletethanks alot
ReplyDeleteplease continue. my search to learn kannada stopped at your blog. suggested this blog to most of my friends from andhra working in banglore.being a medico, beg you to give common complaints like fever cough cold,etc in kannada. once again thanks for your kind effort.