Sunday, March 7, 2010

కన్నడ నేర్చుకుందాం - 10

పాటం -౧౦
ఈ రోజు భవిష్యత్ కాలం లో క్రియా పదముల గురించి తెలుసుకుందాం.
భవిష్యత్ కాలం:
ఏక వచనం:
పుంలింగం: బరుత్తానే - వస్తాడు. ఉదా: రాము బరుత్తానే - రాము వస్తాడు.
స్త్రీ లింగం: బరుత్తాళె - వస్తాది. ఉదా: రమ్య బరుత్తాళె - రమ్య వస్తాది
నపుంసక లింగం: బరుత్తదే - వస్తాది. ఉదా: బస్సు బరుత్తదే - బస్సు వస్తాది.

బహు వచనం:
స్త్రీలింగం , పుంలింగం : బరుత్తారే - వస్తారు. ఉదా: రాము బర్తారే - రాము వస్తారు, సీత బర్తారే - సీత వస్తారు
నపుంసక లింగం: బరుత్తవే - వస్తాయి. ఉదా: బస్సుగళు బర్తావే - బస్సులు వస్తాయి.

కన్నడ నేర్చుకుందాం - ప్రత్యేక పాటం - 2

ఈ వారం ప్రత్యెక పాటం లో కన్నడ సంఖ్యలు నేర్చుకుందాం.
ఒందు - ఒకటి హన్నోందు - పదకొండు
ఎరడు - రెండు హన్నేరడు - పన్నెండు
మూరు-మూడు హదమూరు - పదమూడు మువ్వత్తు- ముప్పై
నాల్కు - నాలుగు హధనాల్కు - పదనాలుగు నలవత్తు - నలబై
ఐదు - ఐదు హధనైదు - పదహేను ఐవత్తు - యాబై
ఆరు - ఆరు హధనారు - పదహారు అరవత్తు- అరవై
ఏళు - ఏడు హధనేళు - పదిహేడు ఎప్పత్తు - డెబ్బై
ఎంటు - ఎనిమిది హధనెంటు - పద్దెనిమిది ఎనవత్తు - ఎనబై
ఒంబత్తు - తొమ్మిది హత్తోమ్బత్తు -పంతొమ్మిది తోమ్బత్తు- తొంబై
హత్తు - పది ఇప్పత్తు - ఇరవై నూరు - వంద

సావిర - వెయ్య
హత్తు సావిర - పది వేలు
లక్ష - లక్ష
కోటి - కోటి

Thursday, March 4, 2010

కన్నడ నేర్చుకుందాం - 9

పాటం - ౯
నిన్న క్రియాపదమును భూత కాలములో ఎలా వాడలో తెలుసుకున్నాం కదా. ఈ రోజు వర్తమాన కాలం గురించి తెలుసుకుందాం,
వర్తమాన కాలము: బర్తా - వస్తూ
ఏక వచనం
పుంలింగం: - బర్తా ఇదానే - వస్తూ వున్నాడు. ఉదా: రాము బర్తా ఇదానే - రాము వస్తూ వున్నాడు.
స్త్రీలింగం: బర్తా ఇదాళె - వస్తూ వుంది. ఉదా: రమ్య బర్తా ఇదాళె - రమ్య వస్తూ వుంది.
నపుంసకలింగం: బర్తా ఇదే - వస్తూ వుంది. ఉదా: బస్సు బర్తా ఇదే - బస్సు వస్తూ వుంది.

బహువచనం:
స్త్రీలింగం, పుంలింగం: బర్తా ఇదారే - వస్తూ వున్నారు. ఉదా: రాము బర్తా ఇదారే -రాము వస్తూ వున్నారు. సీత బర్తా ఇదారే - సీత వస్తూ వున్నారు.
నపుంసకలింగం: బర్తా ఇదావే - వస్తూ వున్నాయి. ఉదా:నీరు బర్తా ఇదావే - నీళ్ళు వస్తున్నాయి.
గమనిక: 'ఇదావే' ని కుదించి 'ఇవే' అని కూడా అనొచ్చు. ఉదా: నీరు బర్తా ఇవే.

Wednesday, March 3, 2010

కన్నడ నేర్చుకుందాం - 8

పాటం ౮.
క్రియా పదముల గురించి తెలుసుకొనే ముందు కాలముల గురించి తెలుసుకుందాం.
ఉదాహరణకు ఒక క్రియాపదం తీసుకొని తెలుసుకొందాం తర్వాత కొన్ని క్రియా పదములను చూద్దాం.

క్రియా పదం: బరువుదు:రావటం (బా అంటే రా అని)

భూత కాలం:
ఏక వచనం :
పుంలింగం: బందను - వచ్చాడు. ఉదా: రాము బందను - రాము వచ్చాడు.
స్త్రీలింగం: బందళు - వచ్చింది. ఉదా: సీత బందళు - సీత వచ్చింది.
నపుంసకలింగం: బంతు. - వచ్చింది. ఉదా: బస్సు బంతు - బస్సు వచ్చింది.
మనం తెలుగులో స్త్రీలింగం మరియు నపుంసక లింగం ఒకేలా వాడతాం. కన్నడలో రెండు వేర్వేరు.

బావువచనం:
పుంలింగం, స్త్రీలింగం: బందరు - వచ్చారు - ఉదా: డా. రాజ్ బందరు. - డా. రాజ్ వచ్చారు, జనరు బందరు - జనం వచ్చారు, సుధా మూర్తి బందరు - సుధా మూర్తి వచ్చారు.
నపుంసకలింగం: బందవు - వచ్చాయి. ఉదా: బస్సుగళు బంధవు - బస్సులు వచ్చాయి.

Tuesday, March 2, 2010

కన్నడ నేర్చుకుందాం - 7

పాటం ౭.
ఇంత వరకు నేర్చుకున్న పదములకు ప్రశ్నార్ధకాలు తెలుసుకుందాం.

పదం: నాను
ప్రశ్న:నానా?
తెలుగు: నేనా?

ప:నీను
ప్ర: నీనా?
తే:నువ్వా?

ప. నిన్న (నిన్న అంటే నీ యొక్క అని తెలుసుకున్నాం కదా! 'నిన్నదు' అంటే 'నీది' అని. బహువచనం అయితే 'నిమ్మదు' అనాలి.)
ప్ర: నిన్దా?. బహువచనంలో అయితే 'నిమ్దా?' అనాలి.
తె: నీదా? 'నిమ్దా' అంటే 'మీదా' అని

ప. నన్న. (నన్న అంటే నా యొక్క అని కదా. అలాగే 'నన్నదు' అంటే 'నాది' అని. బహువచనం అయితే 'నమ్మదు' అనాలి.
ప్ర:నన్దా?. బహువచనం అయితే 'నమ్దా?'
తె:నాదా? 'నమ్దా?' అంటే 'మాదా?' అని.

ప. ఇదు.
ప్ర:ఇదా?
తె: ఇదా. (చూసారా తెలుగు కన్నడ ఒకేలా వున్నాయి. తెలుగులో 'ఇదే' అనటానికి కూడా 'ఇదే' అని అనాలి. కన్నడ లో ఇదే అంటే 'ఇదే' మరియు 'వుంది' అని రెండు అర్ధాలు వస్తాయి.)
తెలుగు లో 'వుందా?' అనటానికి 'ఇదేయా?' అనాలి.

ప. అదు.
ప్ర: అదా?
తె. అదా? . 'అదే' కూడా 'అదే'

ప.బేకు.
ప్ర. బేకా?
తె:కావాలా?

ప.బేడ
ప్ర. బేడా?
తె:వద్దా?

కన్నడ నేర్చుకుందాం - 6

పాటం ౬:

కన్నడ: ఏను బేకు?
కొత్త పదములు: బేకు=కావాలి
తెలుగు: ఏమి కావాలి?

క: ఇదు బేడ.
కో.ప:బేడ=వద్దు
తె: ఇది వద్దు.

క:ఎల్లా బేకు
కో.ప: ఎల్లా=అంతా
తె: అంతా కావాలి.

క:ఇదు హౌదు
కో.ప: హౌదు=అవును
తె: ఇది అవును.

క: అదు అల్ల
కో.ప: అల్ల=కాదు
తె:అది కాదు.
అవునా? అనటానికి హౌదా? అని కాదా? అనటానికి అల్లా? అని అనాలి.

క: అదు ఇల్ల
కో.ప: ఇల్ల=లేదు
తె:అది లేదు.
లేదా అనటానికి ఇల్లా? అని అనవచ్చు.

ఈ వాక్యాలు అర్ధం చేసుకోండి.
ఆవాగ ఇల్ల.
యాకె బేకు
ఇదు PC. హౌదా అల్లా?

Monday, March 1, 2010

కన్నడ నేర్చుకుందాం - 5

పాటం - ౫:
మొన్న చెప్పుకున్న ప్రశ్నలకీ సమాధానాలు ఎలా ఉంటాయో చూద్దాం.
కన్నడ ప్రశ్న: ఎల్లి నీను? (ఎక్కడ నువ్వు?)
కన్నడ జవాబు: ౧) ఇల్లి నాను ౨) అల్లి నాను.
కొత్త పదములు: ఇల్లి=ఇక్కడ; అల్లి=అక్కడ
తెలుగు: ౧)ఇక్కడ నేను ౨) అక్కడ నేను

కన్నడ ప్రశ్న: యావాగ ఇదే? (ఎప్పుడు వుంది?)
కన్నడ జవాబు: ౧) అవాగ ఇదే. ౨) ఈవాగ ఇదే.
కొత్త పదములు:అవాగ = అప్పుడు ; ఈవాగ=ఇప్పుడు
తెలుగు: ౧) అప్పుడు వుంది ౨) ఇప్పుడు వుంది.

కన్నడ ప్రశ్న: నీను యావ కంపని? (నువ్వు ఎ కంపని?)
కన్నడ జవాబు: ౧) నాను ఆ కంపని ౨) నాను ఈ కంపని.
కో. ప = ఆ=ఆ; ఈ=ఈ
తెలుగు:౧)నేను ఆ కంపని ౨)నాను ఈ కంపని

కన్నడ ప్రశ్న: అదు హెగె? (అది ఎలా?)
కన్నడ జవాబు: అదు హీగే.
కో.ప:హీగే=ఇలా
తెలుగు:అది ఇలా.