Saturday, February 27, 2010

కన్నడ నేర్చుకుందాం - ప్రత్యేక పాటం - 1

వారాంతం కాబట్టి ప్రత్యేక పాటం. ప్రతి వారాంతం లోను ప్రత్యేక పాటలు చెప్పుకుందాం.
ప్రత్యేక పాటం - 1
ఈ వారం కన్నడ లిపి గురించి చెప్పుకుందాం.
కన్నడ తెలుగు లిపి 90% ఒకేలా వుంటుంది.
అచ్చులు - స్వరగళు
ಅ ಆ ಇ ಈ ಉ ಊ ಋ ಎ ಏ ಐ ಒ ಓ ಔ ಅಂ ಅಃ
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః
కన్నడ లో ౠ అక్షరం లేదు.
- ఈ మూడు అక్షరాలు మాత్రం చాల భిన్నంగా ఉంటాయి. ಎ ಏ - కొంచం తేడాగా ఉంటాయి. మిగిలినవన్నీ తెలుగు అక్షరాలే.

హల్లులు - వ్యంజనగళు
ಕ ಖ ಗ ಘ ಙ - క ఖ గ ఘ ఙ : ಕ చాల బిన్నంగ వుంటాది. ಘ కొంచం భిన్నంగ వుంటాది.
ಚ ಛ ಜ ಝ ఞ - చ ఛ జ ఝ ఞ : ಚ ಛ భిన్నంగ ఉంటాయి.
ಟ ಠ ಡ ಢ ಣ - ట ఠ డ ఢ ణ :ಠ ಣ తప్ప మిగిలినవన్నీ కొంచం భిన్నంగ ఉంటాయి.
ತ ಥ ದ ಧ ನ - త థ ద ధ న : అన్ని ఒకేలా ఉంటాయి
ಪ ಫ ಬ ಭ ಮ - ప ఫ బ భ మ - ಪ ಫ ಮ కొంచం బిన్నంగా ఉంటాయి.
ಯ ರ ಲ ವ ಶ ಷ ಸ ಹ ಳ - య ర ల వ శ ష స హ ళ : ವ కొంచం బిన్నంగ వుంటాది. ಹ చాల బిన్నంగా వుంటాది.
ఱ కన్నడలో లేదు.

గుణింతం - క అక్షరం చాల బిన్నంగ వుంటాది కాబట్టి గ గుణింతం తీసుకున్నాను. ఇలా అయితే తేడాలు స్పష్టంగ తెలుస్తాయి.
ಗ ಗಾ ಗಿ ಗೀ ಗು ಗೂ ಗೃ ಗೆ ಗೇ ಗೈ ಗೊ ಗೋ ಗೌ ಗಂ ಗಃ - గ గా గి గీ గు గూ గృ గె గే గై గొ గో గౌ గం గః
ಗೀ ಗೇ ಗೋ అక్షరాలు గమనించండి. అవి వాటి ముందు అక్షరంలానే వున్నాయి. తేడా మాత్రం 6 ని తిరగేసి రాయాలి.

Thursday, February 25, 2010

కన్నడ నేర్చుకుందాం - 4

పాటం ౪.
ఈ రోజు 6W+1H గురించి తెలుసుకుందాం.
6Ws: What, When, Where, Why, Which,Who and How

What (ఏమి), Who (ఎవరు) గురించి చెప్పుకున్నాం. మిగిలిన వాటి గురించి చెప్పుకుందాం

కన్నడ:ఎల్లి నీను? గౌరవంగా అయితే 'ఎల్లి నీవు' అనాలి. 'నీవు' అంటే 'మీరు' అని చెప్పుకొన్నాం కదా.
కొత్త పదం: ఎల్లి=ఎక్కడ
తెలుగు: ఎక్కడ నువ్వు?

కన్నడ: యావాగ ఇదె?
కొ.ప: యావాగ=ఎప్పుడు; ఇదె=వుంది.
తె:ఎప్పుడు వుంది?

కన్నడ: అదు యాకె?
కొ.ప: యాకె=ఎందుకు
తె: అది ఎందుకు?

క: నీను యావ కంపని?
కొ.ప: యావ= ఎ
తె: నువ్వు ఎ కంపని?

క: అదు హేగే?
కొ.ప: హేగే = ఎలా
తె: అది ఎలా?

క్రింది వాక్యాలని అర్ధం చేస్కోవడానికి ప్రయత్నించండి.
అవను ఎల్లి?
అదు యావాగ?
ఇవను యాకె?
అవను యావ డెవలపర్ ?
ఇదు హేగే?

పదముల పట్టికకై పక్కనున్న లింక్ చూడండి.

Wednesday, February 24, 2010

కన్నడ నేర్చుకుందాం - 3

పాటం ౩.
కన్నడ: అవను యారు?
కొత్త పదములు: అవను=అతడు; అవరు=వారు (గౌరవంగా అయితే 'అవరు' అనాలి. )
తెలుగు: అతడు ఎవరు?

క:ఇదు ఏను?
కో.ప : ఇదు=ఇది
తె:ఇది ఏమిటి?

క:అదు యారు?
కో.ప: అదు=అది
తె:అది ఎవరు? ('అది ఎవరు' అనడానికి 'ఎవరది' అంటాం కదా అలాగే 'యారదు' అనవచ్చు. )

క:ఇవను యారు?
కో.ప:ఇవను=ఇతడు;ఇవరు=వీరు;
తె:ఇతడు ఎవరు?

క్రింది పదములను అర్ధం చేస్కోవడానికి ప్రయత్నించండి.
ఇవరు డా.రాజ్ కుమార్
అవరు విష్ణు వర్ధన్
ఇవను ఉపేంద్ర
అవను అమ్బిరేష్

పదముల పట్టికకై పక్కనున్న words list చూడండి.

Tuesday, February 23, 2010

కన్నడ నేర్చుకుందాం - 2

పాటం ౨.
నిన్నటి ప్రశ్నలకి జవాబులు చెప్పుకొందాం.

ప్రశ్న: నీను యారు? (నువ్వు ఎవరు)
జవాబు: నాను సాఫ్ట్ వేర్ ఇంజినీర్.
కొత్త పదములు: నాను=నేను;

'నీవు యారు' అనే ప్రశ్నకి కూడా పైదే జవాబు.

ప్రశ్న:నిమ్మ హెసరు ఏను? (మీ పేరు ఏమిటి?)
జ:నన్న హెసరు వెంకట్.
కొత్త పదములు: నన్న= నా,నా యొక్క
తెలుగు: నా పేరు వెంకట్.

పదముల పట్టిక:
నాను=నేను; నీను=నువ్వు; నీవు=మీరు
నన్న=నా,నా యొక్క; నిన్న=నీ,నీ యొక్క, నిమ్మ=మీ,మీ యొక్క
ఏను=ఏమిటి, ఏమి; యారు=ఎవరు

క్రింది వాక్యాలను అర్ధం చేస్కోవటానికి ప్రయత్నించండి
యారు సాఫ్ట్ వేర్ ఇంజినీర్?
నాను సాఫ్ట్ వేర్ ఇంజినీర్.
నిన్న కోడ్
నన్న టెస్ట్.
నిన్న బగ్

Monday, February 22, 2010

కన్నడ నేర్చుకుందాం - 1

హాయ్! మీరు కర్ణాటక లో ఉంటున్నారా? అయితే మీకు కన్నడ చాల అవసరం కదా.
ఇంగ్లీష్ నుంచి కన్నడ నేర్చుకుంటే హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లి బెంగుళూరు వచ్చినట్టే.
కన్నడ తెలుగు చాల దగ్గరగా ఉంటాయి. తెలుగు నుంచి కన్నడ చాల సులభంగా నేర్చుకోవచు. ఎంత సులభంగా అంటే నీళ్ళు తగినంత సులభంగా. నేను ఖాలీ దొరికినప్పుడల్లా కొంచం కొంచం వ్రాస్తుంటాను.
ఇక మొదలు పెడదాం.
పాటం ౧.
కన్నడ: నీను యారు?
తెలుగు: నువ్వు ఎవరు?
కొత్త పదాలు: నీను = నువ్వు; యారు=ఎవరు.

క: నీవు యారు?
తె: మీరు ఎవరు?
కో.ప: నీవు=మీరు.

క: నిమ్మ హెసరు ఏను?
తె: మీ పేరు ఏంటి?
కో.ప:నిమ్మ=మీ,మీ యొక్క; హెసరు=పేరు; ఏను=ఏమిటి,ఏమి.

ఇప్పుడు నేర్చుకొన్న పదాలతో కొత్త వాక్యాలు చేద్దాం.

క్రింది వాక్యాలు అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించండి.
నిన్న హెసరు ఏను? (నిన్న = నీ, నీ యొక్క)